Saturday, August 25, 2007

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా?

ప్రస్తుత సెల్ ఫోన్ వాడకందారులలో అత్యధిక శాతం నోకియా మొబైల్ వాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.దానికి గల ముఖ్యమైన కారణం బ్యాటరి చార్జింగ్ ఎక్కువ కాలం రావడమే. అందుకే చాలా మంది నోకియా మొబైల్ కొత్తది లేక పాతది కొండానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఫోనైతే పరవాలేదు అదే పాతఫోన్ అయితే అది ఎప్పుడు తయరు చేయబడింది, ఎప్పుడు కొనబడింది, ఎప్పుడు రిపేర్ చేయబడింది,దాని సీరియల్ నెంబరు, మొత్తం ఎన్నిగంటలు ఉపయోగించారు మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ సెల్ లో *#92702689# టైప్ చేసి చూడండి.

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటే ముందుగా Start బటన్ పై క్లిక్ చేసి Run కమాండ్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చే విండోలో Diskpart అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు డాస్ లో Diskpart> అని కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దాని ప్రక్కన List Volume అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు మన కంప్యూటర్ లోని అన్ని వాల్యూములను చూపిస్తుంది. అపుడు మనము దాచేయాలనుకున్న డ్రైవ్ యొక్క వాల్యూములను ముందుగా సెలక్ట్ చేయాలి. ఉదాహరణకు వాల్యూము 2 E డ్రైవ్ అయితే Select volume 2 అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు వాల్యూము 2 అంటే E డ్రైవ్ సెలక్ట్ అవుతుంది.  డ్రైవ్ ఇక కనబడకూడదంటే Remove letter E అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. ఒక్కొక్కసారి కంప్యూటర్ రీస్టార్ట్ చేయవలసి రావచ్చు. ఇక మీకు E  డ్రైవ్ మీకు కనిపించదు. కంగారు పడకండి మీ డాటా ఎక్కడికీ పోదు. మనము కేవలం దాచామంతే. మరలా కనిపించాలంటే  పైన చెప్పిన విధముగా మరలా చేసి Remove letter E అన్న చోట Assign letter E అని టైప్ చేస్తే చాలు.