Saturday, May 17, 2008

మీ హార్డ్ డ్రైవ్లో సిస్టం రిస్టోర్ ఫోల్డర్లో వున్న వైరస్ ఫైల్స్ డిలేట్ అవ్వడం లేదా?


కంప్యూటర్ కు వైరస్ వచ్చినపుడు యాంటీవైరస్ ద్వారా క్లీన్ చేస్తే సిస్టం రిస్టోర్ ఫోల్డర్లో వున్న వైరస్ ఫైల్స్ తప్ప అన్ని క్లీన్ అవుతుంటాయి. కాని వైరస్ మరలా ఈ సిస్టం రిస్టోర్ నుండి ఇన్ ఫెక్ట్ అవుతుంది. చాలామంది ఈ సిస్టం రిస్టోర్ ఫోల్డర్లో వున్న వైరస్ ఫైల్స్ ఎలా డిలేట్ చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు ఈ క్రింది విధముగా ప్రయత్నించండి.
ముందుగా కంట్రోల్ పానెల్ లోని ఫొల్డెర్ ఆప్షన్స్ లొ ముందుగా షో హిడెన్ అండ్ సిస్టం ఫైల్స్ ను సెలక్ట్ చేయండి.
తరువాత అదే టాబ్లో హైడ్ ఆపరేటింగ్ సిస్టం ఫైల్స్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేయండి.
ఇప్పుడు ప్రతీ డ్రైవ్ లో మీకు రీసైకిల్ మరియు సిస్టం వాల్యుం ఫోల్డర్స్ కనిపిస్తాయి. అక్కడనుండి మీ వైరస్ ఫైల్స్ డిలేట్ చేయవచ్చు.
సిస్టం రిస్టోర్ ఆఫ్ చెయ్యాలంటే సిస్టం టూల్స్ లోని సిస్టం రిస్టోర్ లోనికి వెల్లి సిస్టం రిస్టోర్ సెట్టింగ్స్ లో టర్న్ ఆఫ్ సిస్టం రిస్టోర్ అనే ఆప్షన్ సెలక్ట్ చెయ్యండి. అక్క్డనుంది కూడా సిస్టం రిస్టోర్ లోని ఫైల్స్ను డిలేట్ చెయ్య వచ్చు.




Sunday, February 24, 2008

మీకెప్పుడైనా డిలేట్ అయిపోయిన ఫైల్స్ మరలా వెనుకకు తెచ్చుకోగలిగితే బావుండును అనిపించిందా?


మనలో చాలా మంది తెలిసో తెలియకో ముఖ్యమైన ఫైల్స్ డిలేట్ అయిపోతే అయ్యో పోయాయే ని బాధ పడుతుంటారు. అయితే ఇలా డిలేట్ అయిపోయిన ఫైల్సును సైతం వెనుకకు తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
కంప్యూటర్లోని ఫైల్స్ డిలేట్ అయిన విధానాన్ని బట్టి రికవరీ అనేది ఆధార పడి వుంటుంది.
1. మీరు కీబోర్డ్లోని డిలేట్ గాని, రైట్ క్లిక్ డిలేట్ ద్వారా గాని డిలేట్ చేస్తే వాటిని రికవరీ చేయాలంటే డెస్క్ టాప్ పై ఉన్న రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తే దానిలో డిలేట్ అయినవి కనిపిస్తాయి. అపుడు వాటిని సెలక్ట్ చేసి మౌసు రైట్ క్లిక్ చేస్తే వచ్చే మెనూలో రిస్టోర్ అనే ఆప్షన్ సెలక్ట్ చేస్తే రికవరీ అవుతాయి.
2. అలా కాకుండా పర్మినంట్ గా డిలేట్ అయిపోతే ఇక తర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ వాడాల్సిందే. అలాంటి వాటిలో బాగా పనిచేసేది గెట్ డాటా బ్యాక్
ఈ సాఫ్ట్ వేరును మీరు ఉపయోగించే ఫైల్ సిస్టము ఆధారంగా కొనుగోలు చేయవలసి వుంటుంది. అనగా ఫాట్ లేదా ఎన్.టి.ఎఫ్.ఎస్.ను బట్టి.
అయితే ఈ డాటా రికవరీ అనేది డిలేట్ చేసిన లొకేషన్ లో వేరే కొత్త డాటా రాయబడనంత వరకూ రికవరీ చేయవచ్చు. కాబట్టి డాటా రికవరీ అనేది డాటా లాస్ అయిన వెంటనే ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వుంటాయి.
ఈ సాఫ్ట్ వేర్ ను ఈ క్రింది సైట్ నుండి డవున్లోడ్ చేసుకోవచ్చు.
http://www.runtime.org/downloads.htm

Wednesday, January 30, 2008

మీరు క్రియేట్ చేసుకున్న ఫైల్స్ గాని, ఫోల్డర్ గాని ఎవరికీ కనిపించకుండా దాచాలనుకుంటున్నారా?


మీరు క్రియేట్ చేసుకున్న ఫైల్స్ గాని, ఫోల్డర్ గాని ఎవరికీ కనిపించకుండా దాచాలనుకుంటే, మీరు దాచాలనుకున్న ఫైల్స్ గాని, ఫోల్డర్ గాని సెలక్ట్ చేసుకుని వాటిపై మౌస్ తో రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చిన విండోలో హిడెన్ సెలక్ట్ చేసి అప్ప్లై పై క్లిక్ చేయాలి.అపుడు అవి దాచబడతాయి.
ఇలా దాచినవి మరలా రావాలంటే ఏదేని విండోలో టూల్స్ మెనూలోని ఫోల్డర్ ఆప్షన్స్ గాని, స్టార్ట్ మెనూలోని, సెట్టింగ్స్ లోని, కంట్రోల్ పేనల్ లోని, ఫోల్డర్ ఆప్షన్స్ సెలక్ట్ చేయాలి.
ఫోల్డర్ ఆప్షన్స్ విండోలో వ్యూ టాబ్ లో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లో "షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్" సెలక్ట్ చేయాలి. అపుడు దాచినవి కనిపిస్తాయి.
మరలా కనిపించకూడదనుకుంటే టూల్స్ మెనూలోని ఫోల్డర్ ఆప్షన్స్ గాని, స్టార్ట్ మెనూలోని, సెట్టింగ్స్ లోని, కంట్రోల్ పేనల్ లోని, ఫోల్డర్ ఆప్షన్స్ సెలక్ట్ చేయాలి.
ఫోల్డర్ ఆప్షన్స్ విండోలో వ్యూ టాబ్ లో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లో డు నాట్ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ సెలక్ట్ చేయాలి.

Monday, November 19, 2007

మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినారా?


మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినట్లయితే, ఒక కొత్త లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోసం అంతర్జాలము(ఇంటర్ నెట్)లో ఎన్నో రకాల కొత్త లుక్ తో మీకు విండొస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టములు లభిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే మీరు ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేసుకున్న తరువాత డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసుకోనవసరం లేదు మరియు ఒక పి.సి. యూజర్కి అవసరమైన కొన్ని మృదులాంత్రములు (సాప్ట్ వేర్స్)కూడా వీటితో పాటు మనకు ఇన్ స్టాల్ అవుతాయి.( విన్ యాంప్,మీడియా ప్లేయర్11, ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 7, యాంటీ వైరస్, బర్నర్స్, సిస్టం టూల్స్, ట్వీకింగ్ యుటిలిటీస్ మొదలైనవి).అటువంటి ఆపరేటింగ్ సిస్టములకు
ఉదాహరణ:
1. విండోస్ డార్క్ ఎడిషన్

2. విండోస్ బ్లాక్ ఎడిషన్

3. విండోస్ క్రిస్టల్ ఎక్స్ పీ

4. విండోస్ రాయల్ ఎక్స్ పీ

5. విండోస్ వెబ్మొసిస్ ఎక్స్ పీ

6. విండోస్ స్పైడర్మాన్ ఎక్స్ పీ

ఇలాంటివి ఇంకెన్నో మీకు అంతర్జాలములో వెదకినట్లయితే లభిస్తాయి.

మీరు కూడా ఇటువంటి ఆపరేటింగ్ సిస్టం స్వంతముగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో నా తరువాతి పోస్ట్ లో తెలియ చేయగలను.

Sunday, September 9, 2007

1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు. స్క్రీన్ ను కుడి చేతి వైపుకు మారాలంటే *#5512#  అని ఇవ్వాలి.స్క్రీన్ ను తిరగేసి చూడాలంటే *#5513# అని ఇవ్వాలి. స్క్రీన్ ను ఎడమ చేతి వైపుకు మారాలంటే *#5514# అని ఇవ్వాలి. మరలా మామూలుగా రావాలంటే *#5511# అని టైప్ చేయాలి .

Saturday, August 25, 2007

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా?

ప్రస్తుత సెల్ ఫోన్ వాడకందారులలో అత్యధిక శాతం నోకియా మొబైల్ వాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.దానికి గల ముఖ్యమైన కారణం బ్యాటరి చార్జింగ్ ఎక్కువ కాలం రావడమే. అందుకే చాలా మంది నోకియా మొబైల్ కొత్తది లేక పాతది కొండానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఫోనైతే పరవాలేదు అదే పాతఫోన్ అయితే అది ఎప్పుడు తయరు చేయబడింది, ఎప్పుడు కొనబడింది, ఎప్పుడు రిపేర్ చేయబడింది,దాని సీరియల్ నెంబరు, మొత్తం ఎన్నిగంటలు ఉపయోగించారు మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ సెల్ లో *#92702689# టైప్ చేసి చూడండి.

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటే ముందుగా Start బటన్ పై క్లిక్ చేసి Run కమాండ్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చే విండోలో Diskpart అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు డాస్ లో Diskpart> అని కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దాని ప్రక్కన List Volume అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు మన కంప్యూటర్ లోని అన్ని వాల్యూములను చూపిస్తుంది. అపుడు మనము దాచేయాలనుకున్న డ్రైవ్ యొక్క వాల్యూములను ముందుగా సెలక్ట్ చేయాలి. ఉదాహరణకు వాల్యూము 2 E డ్రైవ్ అయితే Select volume 2 అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు వాల్యూము 2 అంటే E డ్రైవ్ సెలక్ట్ అవుతుంది.  డ్రైవ్ ఇక కనబడకూడదంటే Remove letter E అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. ఒక్కొక్కసారి కంప్యూటర్ రీస్టార్ట్ చేయవలసి రావచ్చు. ఇక మీకు E  డ్రైవ్ మీకు కనిపించదు. కంగారు పడకండి మీ డాటా ఎక్కడికీ పోదు. మనము కేవలం దాచామంతే. మరలా కనిపించాలంటే  పైన చెప్పిన విధముగా మరలా చేసి Remove letter E అన్న చోట Assign letter E అని టైప్ చేస్తే చాలు.