Monday, November 19, 2007

మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినారా?


మీరు విండొస్ ఎక్స్ పీ వాడి వాడి విసుగు చెందిపోయినట్లయితే, ఒక కొత్త లుక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ కోసం అంతర్జాలము(ఇంటర్ నెట్)లో ఎన్నో రకాల కొత్త లుక్ తో మీకు విండొస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టములు లభిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే మీరు ఆపరేటింగ్ సిస్టం లోడ్ చేసుకున్న తరువాత డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేసుకోనవసరం లేదు మరియు ఒక పి.సి. యూజర్కి అవసరమైన కొన్ని మృదులాంత్రములు (సాప్ట్ వేర్స్)కూడా వీటితో పాటు మనకు ఇన్ స్టాల్ అవుతాయి.( విన్ యాంప్,మీడియా ప్లేయర్11, ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ 7, యాంటీ వైరస్, బర్నర్స్, సిస్టం టూల్స్, ట్వీకింగ్ యుటిలిటీస్ మొదలైనవి).అటువంటి ఆపరేటింగ్ సిస్టములకు
ఉదాహరణ:
1. విండోస్ డార్క్ ఎడిషన్

2. విండోస్ బ్లాక్ ఎడిషన్

3. విండోస్ క్రిస్టల్ ఎక్స్ పీ

4. విండోస్ రాయల్ ఎక్స్ పీ

5. విండోస్ వెబ్మొసిస్ ఎక్స్ పీ

6. విండోస్ స్పైడర్మాన్ ఎక్స్ పీ

ఇలాంటివి ఇంకెన్నో మీకు అంతర్జాలములో వెదకినట్లయితే లభిస్తాయి.

మీరు కూడా ఇటువంటి ఆపరేటింగ్ సిస్టం స్వంతముగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో నా తరువాతి పోస్ట్ లో తెలియ చేయగలను.

Sunday, September 9, 2007

1600 మొబైల్ లో కనిపించే స్క్రీన్ మనకు కావలసిన వైపుకు మార్చాలంటే ఎలాగో మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువమందిచే వాడబడుతున్న సెల్ ఈ 1600. అయితే ప్రతీరోజూ మనం ఆ స్క్రీన్ ను నిలువుగానే చూస్తూ వుంటాము. అయితే ఆ స్క్రీన్ ను మనకు కావలిసిన విధంగా కూడా తిప్పవచ్చు. స్క్రీన్ ను కుడి చేతి వైపుకు మారాలంటే *#5512#  అని ఇవ్వాలి.స్క్రీన్ ను తిరగేసి చూడాలంటే *#5513# అని ఇవ్వాలి. స్క్రీన్ ను ఎడమ చేతి వైపుకు మారాలంటే *#5514# అని ఇవ్వాలి. మరలా మామూలుగా రావాలంటే *#5511# అని టైప్ చేయాలి .

Saturday, August 25, 2007

మీరు నోకియా మొబైల్ వాడుతున్నారా?

ప్రస్తుత సెల్ ఫోన్ వాడకందారులలో అత్యధిక శాతం నోకియా మొబైల్ వాడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.దానికి గల ముఖ్యమైన కారణం బ్యాటరి చార్జింగ్ ఎక్కువ కాలం రావడమే. అందుకే చాలా మంది నోకియా మొబైల్ కొత్తది లేక పాతది కొండానికి ఇష్టపడుతుంటారు. కొత్త ఫోనైతే పరవాలేదు అదే పాతఫోన్ అయితే అది ఎప్పుడు తయరు చేయబడింది, ఎప్పుడు కొనబడింది, ఎప్పుడు రిపేర్ చేయబడింది,దాని సీరియల్ నెంబరు, మొత్తం ఎన్నిగంటలు ఉపయోగించారు మొదలగు విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ సెల్ లో *#92702689# టైప్ చేసి చూడండి.

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటున్నరా?

మీ కంప్యూటర్ లోని ఒక హార్డ్ డ్రైవ్ ని ఎవరికీ కనబడకుండా దాచేయాలనుకుంటే ముందుగా Start బటన్ పై క్లిక్ చేసి Run కమాండ్ సెలక్ట్ చేయాలి. అపుడు వచ్చే విండోలో Diskpart అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు డాస్ లో Diskpart> అని కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దాని ప్రక్కన List Volume అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు మన కంప్యూటర్ లోని అన్ని వాల్యూములను చూపిస్తుంది. అపుడు మనము దాచేయాలనుకున్న డ్రైవ్ యొక్క వాల్యూములను ముందుగా సెలక్ట్ చేయాలి. ఉదాహరణకు వాల్యూము 2 E డ్రైవ్ అయితే Select volume 2 అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. అపుడు వాల్యూము 2 అంటే E డ్రైవ్ సెలక్ట్ అవుతుంది.  డ్రైవ్ ఇక కనబడకూడదంటే Remove letter E అని టైప్ చేసి ఎంటర్ కీ ని నొక్కండి. ఒక్కొక్కసారి కంప్యూటర్ రీస్టార్ట్ చేయవలసి రావచ్చు. ఇక మీకు E  డ్రైవ్ మీకు కనిపించదు. కంగారు పడకండి మీ డాటా ఎక్కడికీ పోదు. మనము కేవలం దాచామంతే. మరలా కనిపించాలంటే  పైన చెప్పిన విధముగా మరలా చేసి Remove letter E అన్న చోట Assign letter E అని టైప్ చేస్తే చాలు.

Tuesday, July 17, 2007

మీ కంప్యూటర్లోని ప్రోససర్, రాం, హార్డ్ డిస్క్ యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?

చాలామంది కంప్యూటర్ వినియోగదారులకు తమ కంప్యూటర్లో ఏ విధమైన పరికరాలు ఉన్నాయన్నది కనీస అవగాహణ కలిగి ఉండరు. అయితే కంప్యూటర్ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ తమ కంప్యూటర్ కెపాసిటి తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రోససర్, రాం, హార్డ్ డిస్క్ వివరాలు అయినా తెలుసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ యొక్క పనితీరు ముఖ్యంగా ఈ మూడు భాగాలపైనే ఆధారపడిఉంటుంది. ప్రోససర్, రాం వివరాలు తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసిగాని, కంట్రోల్ పేనల్ లోని సిస్టం పై రైట్ క్లిక్ చేసిగాని చెస్తే వచ్చే డయలాగ్ బాక్స్ లో జనరల్ టేబ్ చూడాలి. హార్డ్ డిస్క్ వివరాలు కావాలంటే మై కంప్యూటర్ పై డబుల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో హార్డ్ డిస్క్ ఐకాన్లు ఎన్ని వున్నాయో చూసి వాటిపై రైట్ క్లిక్ చేస్తే డయలాగ్ బాక్స్ లో చూస్తే తెలుస్తుంది.



Sunday, July 15, 2007

1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటున్నారా?


ప్రస్తుత కాలం లో ఎక్కువ మంది నోకియా కంపెనీకి చెందిన 1600 వంటి మోడల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలామందికి 1600 వంటి సెల్ ఫోన్స్ లోనికి వాల్ పేపర్స్ కంప్యూటర్ ద్వారా ఎక్కించుకోవాలని అనుకుంటారు. కాని ఆ మోడల్ సెల్ లోనికి వాల్ పేపర్స్ ఎక్కించుకోలేమేమోనని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సెల్స్ లోనికి కూడా వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ వంటివి లోడ్ చేయవచ్చు. దానికి మన దగ్గర సి.ఎ-45 వైరు, మరియు లోగో మేనేజర్ కంపెనీకి సంబంధించిన మోబి ఎఫ్ ఎక్స్ అనే సాఫ్ట్ వేర్ ఉండలి. దానిని ఈ క్రింది చిరునామా నుండి దిగుమతి చేసుకోవచ్చు.


Saturday, July 14, 2007

మీ కంప్యూటర్ పనితీరు చాలా నెమ్మదిగా ఉందా?




చాలామంది తమ కంప్యూటర్ చాలా పాతది అని, వేగముగా పని చేయలేక పోతున్నామని బాధ పడుతుంటారు. అలాగే కొత్త తరం కంప్యూటర్లు కొన్నవారు కూడా తమ కంప్యూటర్ సరి అయిన వేగంతో పని చేయడం లేదు అని అనుకుంటారు. అలాంటి వారికోసం స్పీడ్ గేర్ అనే సాఫ్ట్ వేర్ ఒకటి వుంది. ప్రయత్నించి చూడండి.
web address: http://www.softcows.com/
ఈ సాఫ్ట్ వేర్ ని కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసి స్లైడర్ను ఫాస్ట్ కు లాగి అప్లై చేసి చూడండి.